02-04-2025 12:00:00 AM
జుక్కల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : జుక్కల్ మండలంలోని పెద్దగుళ్ల గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు మంగళవారం బోరు బావి వేసినట్లు పడంపల్లి రాజు పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని గ్రామస్తులు చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్పం దించి బోరుబావి వేయడానికి తమకు చెప్పారని, దీంతో గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. ఎక్కడ సమస్య ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే స్థానిక నాయకులతో చెప్పి సమన్వయంతో పనిచేపిస్తున్నా రని అన్నారు. ఇందులో పెద్ద గుల్ల నాయకులు మాజీ ఉపసర్పంచ్ గణేష్ పటేల్, హైదర్, సంగ్రాం పటేల్, విఠల్ మరాజ్, బా లాజీ పటేల్, శివ పటేల్, కమలాకర్, శంకర్ కమలే, రాజు కామెల్, సల్మాన్, కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.