మాజీ ఐఏఎస్, రాష్ట్ర పూర్వ సలహాదారు డా.కేవీ రమణాచారి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలుగు బాషా పరిరక్షణకు జంట నగరాల్లోని వివిధ సంస్థలు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయడం అభినందనీ యమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు డా.కేవీ రమణాచారి అన్నారు.
ఆదివారం సాయం త్రం టెలిఫోన్ భవన్ సమీపంలో గల ఐఐఎంసీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువభారతి చేరవతో అన్ని సంస్థలు కలిసి రావడం చూస్తే వృక్షాలన్ని ఒకచోట చేరి ఫల ప్రధానం చేస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. తెలుగు వెలుగు సమాఖ్య ప్రారంభం తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి శుభారంభమని తెలిపారు.
తమిళుల భాషాభిమానం చూస్తే సిగ్గు వేస్తుందని చెప్పారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కృషి ఎనలేనిదన్నారు. తెలుగు వెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అత్యంత చైతన్యం కలిగించే కార్యక్రమమని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ‘తెలుగు వెలుగు సొగసు’ అనే అంశంపై ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వాహకుడు సుధామ ‘తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటి పద్యాలు’ అనే అంశంపై ప్రముఖ రంగస్థల సినీ నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య వంగపల్లి విశ్వనాథం అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు డా.వంశీ రామరాజు, యువ భారతి అధ్యక్షులు డా.ఆచార్య ఫణీంద్ర, ఐఐఎంసీ ప్రిన్సిపాల్ కూర రఘువీర్, కార్యదర్శి జీడిగుంట డా.జి.ఎల్‌కె దుర్గ, కిన్నెర సంస్థ అధ్యక్షుడు ముద్దాలి రఘురాం, మానస ఆర్ట్స్ అధ్యక్షుడు రఘు తదితరులు పాల్గొన్నారు.