calender_icon.png 4 January, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి

01-01-2025 07:07:18 PM

ఏఎస్పి చిత్తరంజన్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఏఎస్పి చిత్తరంజన్ పేర్కొన్నారు. బుధవారం ఆసిఫాబాద్ డివిజన్ పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. ఫిర్యాదుదారులు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా పోలీసు అధికారులను సంప్రదించాలని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ డివి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో డీఎస్పీగా పనిచేసిన కరుణాకర్ హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. ఐపీఎస్ పూర్తి చేసుకున్న చిత్తరంజన్ ఆసిఫాబాద్ డివిజన్ పోలీస్ అధికారిగా మొదటిసారి బాధ్యత స్వీకరించారు. ఏసిపిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు సిఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.