మాజీ మంత్రులు జానారెడ్డి, పుష్పలీల
ముషీరాబాద్, డిసెంబర్ 25 : బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసిన దివంగత టీఎన్ సదాలక్ష్మివిగ్రహ ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని మాజీ మంత్రులు జనారెడ్డి, పుష్పలీల అన్నారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద టీఎన్ సదాలక్ష్మిజయంత్రి ఉత్సవాలను ఆమె తనయుడు డాక్టర్ టీఎన్ వంశతిలక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదాలక్ష్మిచిత్రపటానికి జానారెడ్డి, పుష్పలీల, దళిత సంఘాల నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి, జూపాక సుభద్ర, నల్లా సూర్యప్రకాశ్ రావు, గొల్లపల్లి దయానందరావు, ఐఆర్‌టీఎస్ విశ్రాంత అధికారి భరత్‌భూషణ్, రాజలింగం, గాయకుడు రాంనర్సయ్య, సంగపాక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.