ప్రచారంలో భాగంగా అధ్యాపకులను సన్మానిస్తున్న నరేందర్రెడ్డి
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి
ఆదిలాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): రానున్న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉట్నూర్ మండల కేంద్రంలో గిరిజన విశవిద్యాలయం మం జూరుకు కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం ఉట్నూరులో ప్రైవేటు, ప్రభుత పాఠశాలలతో పాటు గ్రంథాలయంలో పట్టభద్రులు, ఉపాధ్యాయులను కలిసి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. తనను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీతో పాటు గిరిజన విశవిద్యాలయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఉట్నూర్లో మూతబడ్డ డీఈడీ కళాశాలను ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.