calender_icon.png 22 September, 2024 | 4:58 AM

ఆల్ ఇండియా ఎగ్ బోర్డు ఏర్పాటుకు కృషి

22-09-2024 02:47:55 AM

కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి జార్జ్ కురియన్ 

హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కేంద్ర కౌన్సిల్‌లో చర్చించి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఎగ్ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్థక, మ త్య్సశాఖ మంత్రి జార్జ్ కురియన్ అన్నారు. హనుమకొండలోని అశోక కన్వెన్షన్ హాల్ లో శనివారం వరంగల్ పౌల్ట్రీ ఫార్మర్స్‌తో ని ర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోళ్లకు సోకే వ్యాధుల నివారణకు కేం ద్రం త్వరలో మెరుగైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని స్పష్టం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమ యాజమాన్యాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు.

వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ఐఎల్‌టీ, హెచ్‌పీ కారణంగా దేశవ్యాప్తంగా పౌల్ట్రీ ఫామ్స్ మూతపడుతున్నాయని, ఇప్పటికే కేరళలో 14 పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పాడి రైతులు పశువులకు సరిపడిన ంత పశుగ్రాసం సమకూర్చుకునేందుకు 109 రకాల గడ్డి పెంచుకునేందుకు త్వరలో అనుమతులు ఇస్తుందన్నారు. పౌల్ట్రీ ఫార్మర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ.. కరోనా కార ణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆవే దన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్రమంత్రికి పౌల్ట్రీ ఫార్మర్ అసోసియేషన్ నేతలు తమ సమస్యలపై వినతి అందజేశారు. సమావేశంలో సంఘం నేతలు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు,  ప్రభాకర్ రెడ్డి, రాంప్రసాద్, రమణారెడ్డి పాల్గొన్నారు.