calender_icon.png 24 January, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి

24-01-2025 12:00:00 AM

  1. ట్రాఫిక్ వింగ్ కు శ్రీకారం హావేళిఘణాపురం పోలీస్ స్టేషన్‌కు పక్కా భవనం
  2. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 

మెదక్, జనవరి 23(విజయక్రాంతి): మెదక్ పట్టణంలో త్వరలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పేర్కోన్నారు. గురువారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించిన సెల్యూట్ బెస్, పరేడ్ గ్రౌండ్ తో పాటు గ్యాలరీలకు శంఖుస్థాపన చేసిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

గత పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రాపిక్ పోలీసులను కూడా ఏర్పాటు చేయలేని దౌర్బాగ్యమైన దుస్థితిని కల్పించారని విమర్శించారు. అంతే కాకుండా మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు ట్రాఫిక్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు గత సంవత్సరం ఆగష్టు 28న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రేటరీలకు లేఖను అందజేసినట్లు ఆయన గుర్తుచేశారు. అంతే కాకుండా మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంకు పక్కా భవనంతో పాటు హావేళిఘణపురం మండలం పోలీస్ స్టేషన్ కు పక్కా భవనంను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చేతల్లో చూపిస్తా...ఎమ్మెల్యే

మెదక్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాట్లలో చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపెడ్తామని  ఎమ్మెల్యే  రోహిత్ అన్నారు. గత పాలనలో మెదక్ ఏ విధంగా అభివృద్ధి చెందిదో ప్రజలందరికి తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోపే రూ.750 కోట్ల నిధులతో మెదక్ ను అభివృద్ధి దశలో ముందు వరుసలో ఉంచానని ఆయన తెలిపారు.