calender_icon.png 13 February, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరాసుక విగ్రహ ఏర్పాటుకు కృషి..

13-02-2025 07:05:38 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): గోండి ధర్మ గురువు హీరాసుక జయంతి వేడుకలను జయప్రదం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. హీరాసుక జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్యేను కలిసారు. ఈ సందర్భంగా ఈనెల 23న నిర్వహించే హీరాసుక జయంతి ఉత్సవాల పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలో హీరాసుక విగ్రహం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే సభ్యులకు హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక గురువు హీరాసుక చూపిన మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మెస్రం శంకర్, ఆనంద్ రావు, సెడ్మాకే సుభాష్, గెడం మాధవ్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.