calender_icon.png 14 January, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుష్టు నిర్మూలనకు కృషి

03-12-2024 12:00:00 AM

కలెక్టర్ రాజర్షిషా 

ఆదిలాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కుష్టువ్యాధి సమూల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజరి షా సూచించారు. అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టువ్యాధిగ్రస్తుల గుర్తింపు శిబిరాన్ని సోమవారం ఆయన జ్యోతి ప్రజలన చేసి ప్రారంభించారు. అందరితో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు కొనసాగుతుందని.. ఇంటింటి సరే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స చేయాలని వైద్యులకు సూచించారు. వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన పాల్గొన్నారు.