16-03-2025 11:46:57 PM
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఓయూలో 2కె రన్..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): భగత్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌ఎల్.మూర్తి, టి.నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆమనగంటి వెంకటేశ్, డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జెకెశ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించిన 2కెరన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు, యువత భగత్‌సింగ్ స్ఫూర్తితో మతోన్మాదం, కులదురహంకారం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా అధ్యక్షకార్యదర్శులు హస్మిబాబు, జావీద్, లెనిన్, అశోక్‌రెడ్డి, నాయకులు స్టాలిన్, ప్రశాంత్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.