- క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతాం
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- సీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సీపీగా రెండోసారి సోమవారం సీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో నేర నియంత్రణ చేస్తామని, శాంతి భద్రతలను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని చెప్పారు. నగరంలో వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తు న్నట్లు వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.