calender_icon.png 19 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి వ్యాపారుల భద్రతకు కృషి

12-04-2025 12:08:24 AM

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): వీధి వ్యాపారుల భద్రత, జీవనోపాధికి చట్టమైన గుర్తింపునకు కృషి చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅన్నారు. శుక్రవారం జాతీయ హాకర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌ఎఫ్) ప్రతినిధులతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారుల అంశంపై లోతుగా చర్చించారు. వీధి వ్యాపారుల హక్కులు, వృత్తి స్వాతంత్య్రం, జీవనోపాధి భద్రత, చట్టపరమైన గుర్తింపు, వాణిజ్య నిర్వహణకు సంబంధించిన విధానాలపై చర్చించారు. ఎన్‌హెచ్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శక్తిమాన్ ఘోష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 1,500కిపైగా అనుబంధ సంఘా లు, 20 లక్షలమందికి పైగా వీధి వ్యాపారులకు ఎన్‌హెచ్‌ఎఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు.