calender_icon.png 15 March, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందేలా కృషి

15-03-2025 12:00:00 AM

జనగామ, మార్చి 14(విజయక్రాంతి): గీత కార్మికులందరికీ రక్షణ కవచాలైన సేఫ్టీ కిట్లు అందేలా కృషి చేస్తానని బీసీ కమిషన్ మెంబర్ రంగు బాలలక్ష్మి హామీ ఇచ్చారు. జనగామ జిల్లాకు చెందిన పలువురు గీత కార్మికులు తాటిచెట్టుపై నుంచి పడి గాయాలపాలు కాగా వారిని ఆమె పరామర్శించారు. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన బాల్నే శ్రీనివాస్ , దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన గోడిశాల శ్రీనివాస్ , గొల్లపల్లి గ్రామానికి చెందిన తీగల పరశురాములు హైదరాబాద్ లోని నాగోల్ లో గల సుప్రజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిని బాలలక్ష్మి శుక్రవారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం గీత కార్మికులకు అందజేసిన సేఫ్టీ కిట్లతో ప్రమాదాలు తగ్గాయని, ఆ కిట్లు అందరికీ అందేలా చూస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట మల్లయ్య, ఆస్పత్రి ఎండీ శిగ విజయ్ కుమార్ గౌడ్  పాల్గొన్నారు.