calender_icon.png 10 January, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి

03-01-2025 12:15:58 AM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (విజయక్రాంతి): పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్య క్షేత్రంలో ఈ నెలలో జరగనున్న ముక్కోటి  ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చే పర్యాటకులను ఆకర్శించేలా గిరిజన మ్యూజియాన్ని తీర్చిది ద్దాలని అధికారులను ఆదేశించారు.

గురువారం ఆయన భద్రాద్రి ఐటీడీఏ ప్రాంగ ణంలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించి మ్యూజియం అభివృద్ధి కమటీ సభ్యులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఈనె ల 5వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలన్నారు.

మ్యూజియం చుట్టూ కట్టే ఫెన్సింగ్ మల్టీకలర్లలో ఉండాలని,  పర్యాటకులను ఆకర్షించేలా సెల్ఫీ పాయింట్‌ను డిజైనింగ్ చేయాలన్నారు. పిల్లలు ఆటవిడుపు కోసం నిర్మిస్తున్న క్రీడాస్థలం క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు.ఆయన వెంట సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రా జ్, డీడీ ట్రైబల్ వెల్ఫెర్ అధికారి మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య  పాల్గొన్నారు.