26-04-2025 12:00:00 AM
నిర్మల్ ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : తెలంగాణలోని భక్తుల ఇలవేల్పుగా కొలిచే అడలి పోచమ్మ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో విచ్చేస్తామని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం అడవి ఆలయంలో నూతన పాలకవర్గ అధ్యక్షునిగా బుజా గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హాజరయ్యారు.
కొత్తగా ఏర్పాటు అయినా పాలక వర్గం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుం డా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య మాజీ జెడ్పిటిసి రోడ్డ మా రుతి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బురాజ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.