14-04-2025 12:00:00 AM
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్
చేవెళ్ల, ఏప్రిల్ 13: ప్రభత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామెన్ భీమ్ భరత్ చెప్పారు. ఆదివారం మొయినాబాద్ మండలం నక్కల పల్లి గ్రామంలో నిర్వహించిన మల్లిఖార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నవాబ్ పేట మండలం మీనపల్లి కలాన్ గ్రామంలో ఊరడమ్మ , బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులకు స్వామి, అమ్మవార్ల దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య, నవాబ్ పేట మండల అధ్యక్షులు వెంకటయ్య , షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింలు, నాయకులు వెంకటాపూర్ మహేందర్ రెడ్డి , గణేష్ , కేబుల్ రాజు , విఠల్ , బిక్షపతి , బాకరం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.