calender_icon.png 1 January, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషి

04-12-2024 01:14:07 AM

నల్లగొండ, డిసెంబర్ 3 (విజయక్రాంతి): గ్రామీణ రహదారుల అభి వృద్ధికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గొడకొండ్ల, కురంపల్లిలో సీసీరోడ్ల పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల నుంచి రాష్ట్ర రాజధానికి రహదారులను అనుసంధానిస్తామన్నారు. గొడకొండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.