19-03-2025 01:29:30 AM
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల , మార్చి 18 : వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మంగళవారం శంకర్పల్లి మండల వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్గా గోవిందమ్మగోపాల్రెడ్డి, వైస్ చైర్మన్గా కాశెట్టి చంద్రమోహన్ తో పాటు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సేవలిందిస్తుందన్నారు.
పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంటల సాగుకు రైతులకు సూచనలు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మీప్రవీణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.