calender_icon.png 24 January, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

24-01-2025 01:10:58 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో రూ. 51 లక్షలతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వడూర్ గ్రామ అభివృద్ధి నా బాధ్యత అని విడతల వారిగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, విడిసి చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఫయాజ్, ఎంపీటీసీలు పండరీ, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనిల్ అన్న యువ సైన్యం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.