calender_icon.png 22 April, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా మైదానాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

21-04-2025 09:16:23 PM

క్రీడా నైపుణ్యం పెంచుకుంటేనే రాణింపు క్రీడా మైదానాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గ్రామ, పట్టణ స్థాయి క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడపై నైపుణ్యాన్ని పెంచుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కొత్తగూడెం శాసన సభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని ప్రగతి మైదానంలో జరిగిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ యువత క్రీడా, సాంస్కృతిక రంగాలపై ద్రుష్టి సారించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శరీర దారుఢ్యం పెంచడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. యువత అసాంఘిక శక్తులవైపు ఆకర్షితులు కాకుండా భవిషత్తును తీర్చి దిద్దికోవాలని సూచించారు. క్రీడా కారులను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కందుల భాస్కర్, భూక్య శ్రీనివాస్, ధర్మరాజు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, తోట రాజు, దాసరి శ్రీను, బొంకూరి పరమేష్, నిర్వాహకులు స్టార్లిన్, నరేందర్, జేమ్స్, సాయి, బిట్టు, సంతోష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.