calender_icon.png 21 January, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌళిక సదుపాయాల కల్పనకు కృషి

21-01-2025 12:00:00 AM

మునిపల్లి, రాయికోడ్ మండలాలలో  మంత్రి దామోదర్ రాజనర్సింహ  సుడిగాలి పర్యటన బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ డిగ్రీ పీజీ కళాశాల తనిఖీ నిర్మాణం పనుల పరిశీలన. తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పరిశీలన

సంగారెడ్డి, జనవరి 20 (విజయ క్రాంతి)/ మునిపల్లి : మఅందోల్ నియోజకవర్గం లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమ వారం నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి, రాయికోడ్ మండలాలలో మంత్రి దామో దర్ రాజనర్సింహ పర్యటించారు.

బుదేరా లోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ డిగ్రీ పీజీ కళాశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.  కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణం పనులను, డ్రైనేజీ పనులను, క్రీడామైదాన నిర్మాణ పనులను, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. 

కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం  తనిఖీ

తాటిపల్లి కేజీబీబీ పాఠశాలలో విద్యా ర్థులు ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై మంత్రి చర్చించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిఎస్‌ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి,  డీఎస్పీ సత్తయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నర్సింలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.