calender_icon.png 10 January, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు కృషి

09-01-2025 01:47:08 AM

* జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి

కూకట్‌పల్లి, జనవరి 8 (విజయక్రాంతి): కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్‌లలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిఅధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి నుంచి పాదయాత్రగా వినాయకనగర్, నవజీవననగర్, రాజీవ్ గాంధీ నగర్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. లోత ట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అభివృద్ధి పనుల విషయంలో అధికారులు అలసత్వం వీడాలని మేయర్ సూచిం చారు. అల్లాపూర్ డివిజన్ సప్ధర్ నగర్ ఈ బ్లాకులో డ్రైనేజీ, మంచినీటి సరఫరా, సీసీ రోడ్డు తదితర సౌకర్యాలు కల్పించాలని డివిజన్ కార్పొరేటర్ మేయర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, కార్పొరేటర్లు రవీందర్‌రెడ్డి, సబీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు.