calender_icon.png 15 March, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు కృషి

12-03-2025 01:33:14 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నల్లగొండ, మార్చి 11 (విజయక్రాంతి) : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలోని డబుల్ బెడ్రూం కాలనీలో రూ. 85.34 లక్షలతో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

సాధ్యమైనంత త్వరగా అన్ని వసతులు కల్పించి ఇండ్లును లభ్దిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం ఔరవాణి గ్రామంలో రూ.56.45 లక్షలతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన వెంట కాంగ్రెస్ ముఖ్యనాయకులు, ఆయా గ్రామాల ప్రజలున్నారు.