మానకొండూర్, డిసెంబర్ 22: తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ రూపాకల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మాన కొండూరు మండల కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించా రు. అంతకుముందు మానకొండూర్ మినీ ట్యాంక్ బండ్ నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ యువతకు వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వము నిరుద్యోగ భృతి అందజేయా లని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫె స్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్స రంలోనే 50వేల ఉద్యోగాలను నియమిం చిందని గుర్తుచేశారు. ఉద్యోగ నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.