calender_icon.png 25 January, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కృషి: మంత్రి కిషన్ రెడ్డి

24-01-2025 08:23:19 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల(Municipal elections) నిర్వహణకు తనవంతు కృషి చేస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి(Minister G Kishan Reddy) హామీ ఇచ్చారు. పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పట్టణంలో 1/70 చట్టం మూలంగా ఎన్నికలు లేకుండా పోవడంతో పట్టణ అభివృద్ధి ఆశించిన మేర జరగడం లేదని ఎన్నికల నిర్వహించి పాలకవర్గం ఏర్పాటు అయ్యేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్(MP G Nagesh) కు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, కోకన్వీనర్లు మేడిపల్లి సంపత్, దీవి దీక్షితులు, బండారి సూరిబాబు, మాయా రమేష్, కొంగల తిరుపతి రెడ్డి, ఓ రాజశేఖర్, మద్ది శంకర్, సంజీవరావు, ఆర్ వెంకన్న, ఈశ్వర్, ఓ రాయమల్లు, అఖిలేష్ పాండే, మాయ రమేష్, మాయ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.