కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం భారత రాష్ట్రపతితో మాట్లాడి త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ గురువారం కేంద్ర హోంశాఖ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంజయ్ మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాని రాష్ట్రపతితో మాట్లాడి త్వరలోనే ఎన్నికల నిర్వహణ జరిపించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, కో కన్వీనర్స్ మేడిపల్లి సంపత్, దీవి దీక్షితులు, బండారి సూరిబాబు, కొంగల తిరుపతిరెడ్డి, సప్పిడి నరేష్, మిట్ట లక్ష్మణ్, మాయ రమేష్, ఆర్ వెంకన్న, ఆర్ శేఖర్, దాసరి రాజనర్సు, వి వెంకన్న, డి రవి సాగర్, సిపెల్లి సాగర్, సైదుల శ్రీనివాస్, శివ నాయక్ లు పాల్గొన్నారు.