27-03-2025 04:11:14 PM
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు వాంకిడి మండలం కేంద్రంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రపై మండల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సక్కు కార్యకర్తలు, నాయకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టవలసిన విధానాలను వివరించి, దశ దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యకరములో వాంకిడి, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు గురునులే నారాయణ, మసాదే చరణ్, వాంకిడి మండల ఉప అధ్యక్షుడు పోర్ల శంకర్, బీసీ సెల్ అధ్యక్షుడు, గణేష్, టౌన్ ప్రెసిడెంట్, అనిల్, మాజీ ఎంపీటీసీ మారుతీ, మండల యూత్ అధ్యక్షులు దుర్గం ప్రశాంత్, దీపక్ ముండే దుర్గం జీవన్, గురునులే ఆనందరావు, బొట్టుపల్లి జైరాం, మందోకర్ దాదాజీ, మోర్లే తిరుపతి, పత్రు, రమేష్, సదశివ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.