హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితలప్రణవ్ బాబు...
హుజురాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామంలో ఆయన స్వగృహంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన పట్టణ, మండల అధ్యక్షుల నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ఎవరు అధైర్య పడవద్దని అందరికీ పదవులు వస్తాయని సూచించారు.
హుజరాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి, మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులుగా సుంకరి రమేష్, మండల అధ్యక్షునిగా వీరమని పరుశరామారావు, వీణవంక మండల అధ్యక్షునిగా ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఇల్లందకుంట మండల అధ్యక్షుడిగా పెద్ది కుమార్ లను నియమించినట్లు తెలిపారు. అనంతరం వారిని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాకశంకర్, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, మాజీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, సాహెబ్ హుస్సేన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.