calender_icon.png 13 February, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకు కృషి చేయాలి

13-02-2025 04:20:07 PM

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు నందిపాట రాజు..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు నందిపాట రాజ్ కుమార్ కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గురువారం మండల విద్యాధికారి శ్రీనివాస్ ను కలిసి కోరారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర మూల్యాంకణంకు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల పనితీరును, మధ్యాహ్న భోజనం పథకంను మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను పర్య వేక్షించాలన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై కూడా దృష్టి సారించాలనీ కోరారు.