calender_icon.png 20 March, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల మంజూరుకు కృషి చేయాలి

17-12-2024 01:15:45 AM

  • ఎంపీ అర్వింద్‌ను కోరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
  • నవోదయ, కేంద్రీయ విద్యాలయం మంజూరుపై హర్షం

జగిత్యాల, డిసెంబర్ 16 (విజయక్రాంతి): నియోజకవర్గంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి కేంద్ర నుంచి నిధుల మంజూరుకు కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోరారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎంపీని సంజయ్‌కుమార్ సో మవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాలకు నవోదయ, కేంద్రీ య విద్యాలయం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం వద్ద నేషనల్ హైవే విస్తరణలో భాగంగా హై లెవ ల్ బ్రిడ్జి, అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. పలుచోట్ల లో లెవల్ వంతెనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఆ యా ప్రాంతాల్లో బ్రిడ్జీల నిర్మాణానికి నిధు లు మంజూరు చేయించాలని కోరారు. కో మన్‌పెల్లిలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని వినతిపత్రంలో కోరా రు. నిధుల మంజూరుకు ఎంపీ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు.