calender_icon.png 4 March, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

04-03-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, మార్చి 3 (విజయక్రాంతి) ః మారుమూల గిరిజన గ్రామాల నుండి వివిధ సమస్యల ల పరిష్కారానికి గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే గిరిజనుల యొక్క దరఖాస్తులను పరిశీలించి వారి యొక్క సమస్యల పరిష్కరించేలా సంబంధిత యూనిట్ అధికారులు చొరవ చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

సోమవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్లో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ ప్రతి దరఖాస్తుదారుని యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఏవో సున్నం రాంబాబు, ఏడి అగ్రికల్చర్ భాస్కరన్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్,ఏపీఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మనిధర్, ఎఫ్ డి సి ఉదయ్ కుమార్, మిషన్ మామ్ భగీరథ ఏఈఈ నారాయణ రావు, డిఎస్‌ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ విభాగాలకు చెందిన  నరేందర్, భద్రమ్మ, హె ఈ ఓ లింగానాయక్, భార్గవి,ఐసిడిఎస్ సూపర్వుజర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులో చేరే కోర్సులపై అవగాహన కలిగి ఉండాలి 

 సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాల బాలికలు పదవ తరగతి  విజయవంతంగా పూర్తి చేసి తదుపరి కోర్సులు ఏమి చదివితే ఎటువంటి ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో ముందుకు సాగాలని ఐ టి డి ఏ పి ఓ రాహుల్ అన్నారు. జీవితంలో సాధించాల్సిన గోల్ ఒకటి ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే అనుకున్నది సాధించవచన్నారు.

సోమవారం  దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రేరణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏవో మరియు స్పెషల్ ఆఫీసర్ సున్నం రాంబాబు, ఏ సి ఎం ఓ రమణయ్య, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ సమ్మయ్య, తాసిల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, హెఎంలు నరసింహారావు, బట్టు రాములు, సోమశేఖర్, నరేందర్, సర్వేశ్వర దొర మరియు వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.