calender_icon.png 20 March, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలి

19-03-2025 09:00:26 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి ఒక్కరు  కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సంబంధించిన సమాచారం వెంటనే తెలుసుకొనుట కొరకు ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రౌడీ, అనుమానిత హిస్టరీ ఉన్న వారిపై రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని తరచూగా చెక్ చేస్తూ ఉండాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్, ఎటియం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్తలాల యందు సి.సి కెమెరాల ఏర్పాటు తప్పనిసరి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివరణకై అన్ని స్థాయిల అధికారులు దృష్టి సారించాలి. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ పోలీసు స్టేషన్ అధికారితో మాట్లాడి జిల్లాకు సంబందించిన పూర్తి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ... కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశీలించి ఫైనల్ చేయాలన్నారు. ఫోక్సో(POCSO), గ్రేవ్(Grave) కేసుల్లో సాంకేతిక పరజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో నిర్ణీత సమయములో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. అదేవిధముగా కేసులలోని సాక్షులకు కోర్టులో సాక్ష్యం చెప్పే సమయములో ముందస్తుగా వారితో మాట్లాడి కేసు విషయాలు పూర్తిగా తెలియజేయలన్నారు.

అదేవిధముగా నేరస్తులకు శిక్షపడే విధముగా కృషి చేయాలన్నారు. అన్ని రకాల ఫిర్యాదులపై చట్టప్రకారం స్పందించి ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు సందేశం మొబైల్ ద్వారా అందజేయలి అని సూచించారు. గ్రామాలలో సిసి టీవిల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ బ్యాంక్, ఎటియం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్తలాల యందు సిసి టీవిల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో దొంగతనాలు, ఇతర రకాల నేరాలు జరగకుండా, నేరాల నియంత్రణ కొరకు విజబుల్ పోలీసింగ్ పెంచాలని తెలియజేశారు. ఇ-పెట్టి కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నేరాలు నియంత్రన చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చైతన్య రెడ్డి ఏఎస్పి కామారెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, స్పెషల్ బ్యాచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.