21-03-2025 01:44:31 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, మార్చి 20 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి ప్రతిఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్లో రోడ్డు భద్రతపై నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. వాహనదారుల అజాగ్రత్తతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్స్పాట్లలో ప్రమాదాలు నివారణకు ఎన్హెచ్, ఆర్‌అండ్బీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంచాయతీ రోడ్లకు గ్రామ పంచాయతీలే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. పోలీస్శాఖ చర్యల ఫలితంగా జిల్లాలో బ్లాక్ స్పాట్లు 60 నుంచి 40కి తగ్గాయని గుర్తు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. మిషన్ ఆధార్ పేరున రహదారుల వెంట గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
రోడ్లు భవనాలశాఖ ఎస్‌ఈ, జాతీయ రహదారుల సంస్థ ఇంజినీర్లు, పోలీసు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన పోలీస్, ఆర్‌అండ్బీ, ఎన్హెచ్‌ఎస్ సంస్థ అధికారులకు కలెక్టర్, ఎస్పీ ప్రశంస పత్రాలు అందజేశారు.