ఊబర్ ప్రతినిధులతో రవాణా శాఖ మంత్రి
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): భారీగా పెరిగిన వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి తో ఊబర్ ప్రతినిధులు సంజయ్ శ్రద్ధ, ఉమా భట్, మేఘా సింగ్ సమావేశమయ్యారు. ప్రజా రవాణాలో ఉన్న ఊబర్ ఈవీ వాహనాలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఊబర్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేలా చర్యలు తీసుకునేందుకు తాము కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రతినిధుల బృందం వెల్లడించింది. రాష్ట్రం లో ఊబర్ సేవలు మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపింది. తమ వాహనాల్లో ప్రయాణం చేసే మహిళలకు మరింత భద్రత కోసం అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రికి వివరించారు.