calender_icon.png 22 April, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి ఆచార వ్యవహారాన్ని ప్రపంచానికి తెలిసేలా కృషి చేయాలి

16-12-2024 08:20:25 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసి సంస్కృతి అనువుగా ఉన్న మండలాల్లోని గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలను అభివృద్ధి చేసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రాచూర్యంలోకి తీసుకొని వచ్చి ప్రపంచానికి తెలిసే విధంగా రైన్ వాటర్ టీం, స్టూడియో పంచతంత్ర బృందాలు పర్యటిస్తున్నట్లు రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ సీఈవో కల్పనా రమేష్ అన్నారు. సోమవారం జిల్లాలోని ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాలు సాంస్కృతిక సాంప్రదాయాలు అంతరించిపోకుండా ప్రపంచానికి తెలిసే విధంగా జిల్లాలోనీ పాతకాలపు గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధ, గిరిజన తెగలపై ఉన్న ప్రేమానురాగాలు వారి సాంప్రదాయాలు వృద్ధిలోకి రావడానికి ప్రత్యేక సంకల్పంతో రైన్ వాటర్ టీం, స్టూడియో పంచతంత్ర బృందాలను పర్యాటక స్థలాలుగా గుర్తించిన మండలాల్లోని గ్రామాలను పరిశీలిస్తున్నట్లు అన్నారు.

ఈ పర్యటనలో భాగంగా మణుగూరు పుష్కర ఘాట్, పగిడేరు గ్రామంలో ఉన్నటువంటి వేడి నీటి బుగ్గను సింగరేణి ఓపెన్ కాస్ట్లను సందర్శించి డ్రోన్ కెమెరాలతో ఫోటోషూట్ చేయడం జరిగిందని, పగిడేరు వేడి నీటి బుగ్గ ప్రత్యేకత, సింగరేణి ఓపెన్ కాస్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నామని అన్నారు. అనంతరం బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో గోదావరి నడిపోడ్డున ఉన్నటువంటి పురాతన వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయం యొక్క చరిత్రను, ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకుని, అశ్వరావుపేట పూసుకుంట మధ్యలోని తిరుమలకుంట వెళ్లే దారిలో అడవి ప్రాంతంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుట్టలు, అడవి అందాలను డ్రోన్ కెమెరాల ద్వారా చితకరించడం జరిగిందని అన్నారు. 

జిల్లాలోనీ ఆదివాసి గిరిజనుల చరిత్ర, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, అభివృద్ధి పరచడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచన మేరకు జిల్లాలో పర్యటన సాగిస్తున్నామని, పర్యటన అనంతరం జిల్లా యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా, ఈ ప్రాంతాల యొక్క గిరిజన సంస్కృతి అంతరించిపోకుండా జిల్లా కలెక్టర్ చొరవతో విస్తృతంగా అభివృద్ధి చేసి ప్రపంచానికి తెలియజేయడానికి డాక్యుమెంటరీ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తాహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, బూర్గంపాడు ఎంపీడీవో సునీల్ శర్మ, ఎంపీడీవో జమలారెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.