calender_icon.png 19 January, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలి

19-01-2025 06:54:34 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట రత్నం బాబు(Yerneni Venkata Ratnam Babu) అన్నారు. ఆదివారం కోదాడలోని ఎర్నేని బాబు నివాసంలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన వేపూరి తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బషీర్ లకు ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరము కలిసి వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavati)ల ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు.

అనంతరం సన్మాన గ్రహీతలు చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ షేక్ బషీర్ లు మాట్లాడుతూ... తమకు ఇంత ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు కు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో  వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామన్నారు. తమకు పదవి కేటాయించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి,  సహకరించిన సీనియర్ నాయకులకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్. కే జబ్బర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, కాంగ్రెస్ నాయకులు ఒంటి పులి వెంకటేష్, చింతలపాటి శ్రీనివాస్, రావెళ్ళ కృష్ణారావు,  నలజాల శ్రీనివాస్, చందు నాగేశ్వరరావు, మందలపు శేషు,  నెమ్మాది దేవమని ప్రకాష్ బాబు,  కౌన్సిలర్లు గంధం యాదగిరి, వంటి పులి రమా శ్రీనివాస్, కోళ్ల ప్రసన్నలక్ష్మి కోటిరెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, కర్రీ శివ సుబ్బారావు, ఖదీర్, కాజా, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్, యూత్ అధ్యక్షులు పోటు కోటేశ్వరరావు, లైటింగ్ ప్రసాద్, చింత బాబు మాదిగ, కాజా గౌడ్, గంధం పాండు, బొలిశెట్టి భాస్కర్ తదితరులు  పాల్గొన్నారు.