calender_icon.png 18 March, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ సర్వేక్షన్‌లో మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేయాలి

18-03-2025 12:57:10 AM

నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

కరీంనగర్, మార్చి 17 (విజయ క్రాంతి): స్వఛ్చ్ సర్వేక్షన్ లో నగరపాలక సంస్థ కు మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తూ... ప్రజలను భాగస్వాములను చేయాలని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. స్వఛ్చ్ సర్వేక్షన్ 2024 లో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ లో సోమవారం మెప్మా ఎస్ హెచ్ జీ మహిళా సంఘ సభ్యులు, సివోలు, సానిటేషన్ జవానులతో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో నగర పరిశుభ్రతతో పాటు తడి, పొడి చెత్త సెక్రిగేషన్, సిటీజన్ ఫీడ్ బ్యాక్, ఎస్ ఎల్ బి ఇన్ స్పెక్షన్, డీఆర్ సీసీ, ఆర్ ఆర్ ఆర్ సెంటర్ల నిర్వహణ, డోర్ టూ డోర్ కలెక్షన్, మరుగు దొడ్ల నిర్వాహాణ తదితర అంశాల పై చర్చించి... దిశా నిర్ధేశం చేశారు. స్వచ్చ్ సర్వేక్షన్ పోటీలో చేపట్టాల్సిన కార్యక్రమాల పై సలహాలు సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... ఎస్ హెజ్ జీ సమైఖ్యా సంఘాల సభ్యులు, ఆర్పీలు డివిజన్ వారిగా ప్రతి ఇంటిని సందర్శించి.... స్వచ్చ్ సర్వేక్షన్ లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షన్ ఆప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లో సిటీజన్ ఫీడ్ బ్యాక్ చేయిస్తూ... సెక్రిగేషన్ ప్రక్రియ, స్వఛ్చ్ సర్వేక్షన్ కార్యక్రమాల పై ప్రజలను పూర్తి స్థాయిలో అవగాహన పర్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమీషనర్ వేణుమాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ స్వామీ, తదితరులు పాల్గొన్నారు.