25-03-2025 01:34:30 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, మార్చి 24(విజయక్రాంతి) : క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ నారాయణ పేటను వ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వహించగా 903 కేసులు నమోదు కాగా వాటిలో 185 టార్గెట్ ఉన్నాయని అందులో 183 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. టీబీ వ్యాధిని అంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్య లక్ష్మి,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిష్టమ్మ సూపరింటెండెంట్ సులోచనమ్మ శ్రీధర్, భీష్మ ఫౌండేషన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.