జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 1 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్క రు కషి చేయాలని జిల్లా ఎస్పీ అశోక్’ కుమార్ అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అన్ని శాఖల సమన్వ యంతో చేపట్టిన ఆపరేషన్ స్మైల్-- XI విజయ వంతం అయిందని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ ద్వారాజిల్లాలో 30 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడం జరిగిందన్నారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవం తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్-%% కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించగా ఇందులో 30 మంది బాలకార్మికులను గుర్తించి సిడబ్ల్యూసి (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరుపరచడం జరిగిందన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కషి చేయాలని కోరారు.
బాలల హక్కులను పరిరక్షిస్తూ, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కా న్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఎవరైనా బాలల ను పనిలో పెట్టుకున్నా, ఎక్కడైనా పనిచేసి నా, తప్పిపోయిన, వదిలి వేయబడిన బాల ల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచా రం ఇవ్వలని తెలిపారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ --XI విజయవంతం చేయడంలో కషి చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.