13-02-2025 01:17:28 AM
ఎన్జీవోల సమావేశంలో యోగితా రాణా
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, పిల్లల విద్యాభివృద్ధికి ఎన్జీవోలు కృషిచేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఎన్జీవో కన్సల్టేటివ్ సమావేశానికి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నర్సిం హారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, సమగ్ర అభివృద్ధి, పాఠశాలల్లో మెరుగైన అభ్యసన వాతావరణం కల్పించాలని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు, ఎన్జీవోలు కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, కెరీర్ గైడెన్స్, ఉపాధ్యాయ శిక్షణ మొదలైన రంగాల్లో ఎన్జీవోలు చేస్తున్న కృషిని యోగిత రాణా అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరె క్టర్ గాజర్ల రమేష్, సమగ్ర శిక్ష జాయిం ట్ డైరెక్టర్లు పి.రాజీవ్, బి వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.