calender_icon.png 29 December, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

28-12-2024 06:13:05 PM

కామారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

కామారెడ్డి (విజయక్రాంతి): నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2024 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా నూతన సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనకి చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. నేరాల నియంత్రణకు కట్టడి చేయాలని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా ముందు నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం బీర్కూరు పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన బీర్కూరు మండలంలోని మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి గంజాయి దొంగలు డ్రగ్స్ రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు ఫ్రెండ్షిప్ గా ఉండాలని సూచించారు ఇసుక మాఫియా మొరం మాఫియాకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు సూచించారు. నేరాలు ఘోరాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తప్పవంటూ పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి హెచ్చరించారు.