calender_icon.png 15 January, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి

06-09-2024 01:47:32 AM

ఉపాధ్యాయులకు మంత్రి జూపల్లి పిలుపు 

వనపర్తి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): సమాజ పరివర్తనలో విద్య అగ్రభాగాన ఉంటుందని, అలాంటి విద్యను బోధించే ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సంద ర్భంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి హోదా లో పని చేశారని గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీఈవో గోవిందరాజులుతో కలిసి మంత్రి సన్మానించారు.