నడిగూడెం: మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి భాను నాయక్(District Inter Education Officer Bhanu Naik) అన్నారు. శుక్రవారం నడిగూడెం కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ... ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని, ఇంటర్ బోర్డు నిర్ణయించిన 90 రోజుల ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. కళాశాలకు రాని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలకు హాజరయ్యేలా ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలన్నారు. లాంగ్ ఆబ్సెంటీస్, డ్రాప్ అవుట్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం ప్రయోగశాలలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి విజయ నాయక్, అధ్యాపకులు జానీ పాషా, శ్రీధర్, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.