09-04-2025 01:32:18 AM
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్
పెద్దపల్లి, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్ అన్నారు. మంగళవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాంచందర్ ఎన్టి పిసి మిల్లినియం హల్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ , పెద్దపల్లి డిసిపి, మంచిర్యాల డిసిపి అగడి భాస్కర్, జాతీయ ఎస్సీ కమీషన్ సంచాలకులు సునీ ల్ బాబు, రిసేర్చ్ అధికారి డి. వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమి షన్ సభ్యులు వి.రాం చందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేయాలని, నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేందుకు వీలుగా అవసర మైన సాక్ష్యాలను పక్కాగా నమోదు చేయాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, పెద్దపల్లి, గోదావరిఖని ఏ.సి.పిలు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.