calender_icon.png 15 November, 2024 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి

15-11-2024 12:54:03 AM

ఎంపీ ధర్మపురి అర్వింద్

కరీంనగర్, నవంబరు 14 (విజయక్రాం తి): ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని దిశ చైర్మన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్,

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయి స్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచిం చారు. జగిత్యాల జిల్లాను స్మార్ట్ సిటీలో భాగం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు జ్యోతి, మోరా హనుమాండ్లు పాల్గొన్నారు. 

పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: వంశీ

పెద్దపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): పెద్దపల్లి కలెక్టరేట్‌లో గురువారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తాత కాకా అశీర్వాదంతో ప్రతి మూడు నెలలకోకసారి దిశ సమావేశం నిర్వహించి, పెద్దపల్లిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కేంద్ర పథకాల కోసం అధికారులతో నివేదికలు తయారు చేయిం చి నిధులు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని ఎంపీ తెలిపారు. సమా వేశంలో కలెక్టర్ కోయశ్రీహర్ష పాల్గొన్నారు.