కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్ లో తెలంగాణ అగ్రి డాక్టర్ అసోసియేషన్ డైరీ, 20 25 క్యాలెండర్ ను వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో కృషి చేసి రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తూ వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మిలింద్ కుమార్, ఎవో లు మంజుల, విజయకుమార్, దీప్తి, దిలీప్, వినయ్, యుగంధర్, గిరీష్, హేమలత, కార్తిషా తదితరులు పాల్గొన్నారు.