calender_icon.png 5 November, 2024 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత నైపుణ్యానికి కృషి అభినందనీయం

30-08-2024 06:25:48 PM

కరీంనగర్, (విజయక్రాంతి): యువతలో నైపుణ్యానికి స్థానిక బిఎన్.రావు ఫౌండైషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపల్ డా.వై.సత్యనా రాయణ కొనియాడారు. శుక్రవారం స్థానిక ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాలలోని గ్రంథాలయానికి రూ.20వేల విలువ చేసే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను డాక్టర్ బి.ఎన్.రావు కళాశాల ప్రిన్సిపలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రావు మాట్లాడుతూ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కోట్లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అందుకు కారణం యువతలో నైపుణ్యాలు కొరవడటమే నన్నారు. విద్యా విధానాన్ని , కారికులం ను మార్చాలని అన్నారు.చదువుకున్న యువత దేశంలో ఉన్న మానవ వనరులు, మానవ వనరులు దేశ సంపద.ఇంటర్ స్థాయినుంచే అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్క్రిన్సిపల్ టి.రాజయ్య, డాక్టర్ అలీం, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్, ఎస్సారార్ కళాశాల గ్రంథపాలకులు జి. కృష్ణారెడ్డి, విద్యార్థులు  పాల్గొన్నారు.