calender_icon.png 6 November, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటకరంగ అభివృద్ధికి కృషి

06-11-2024 02:47:32 AM

లండన్ పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): సీఎం రేవంత్‌రెడ్డి పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను చాటుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లండన్‌లో జరుగుతున్న ‘44వ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ఎక్స్‌పో’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్రాల పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో, ప్రతిష్టాత్మక ‘లండన్ టీ ఎక్సేంజ్’ చైర్మన్ ఆల్యూర్ రెహమాన్‌తో జూపల్లి మంగళవారం సమావేశ మయ్యారు.పర్యాటక అభివృద్ధిలో భాగంగా విదేశీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో టీ ఎక్సేంజ్ అవుట్‌లెట్ ఏర్పాటు, లండన్‌ెేఐ తరహాలో హైదరాబాద్‌లో జాయింట్ వీల్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు.

తెలంగాణలో టూరిజం అభివృద్ధి, పర్యాటకులకు మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు.  తెలంగాణ పర్యా టక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు.. రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, అనిరుధ్‌రెడ్డి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఎండీ. ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.