- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ
- నాగార్జున సాగర్‌లో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం
- నల్లగొండ, జనవరి 5 (విజయక్రాంతి): ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ, గిరిజనుల రాజకీయ స్వావలంబన శిక్షణా తరగతులను ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు.
- ఆదివాసీలు, గిరిజనులు రాజకీయంగా మరింత ఎదిగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీరిలో రాజకీయ చైతన్యం నింపేందుకు రెండేళ్లలో పదివేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ వెల్లడించారు.
ఆదివాసీలంటే కాంగ్రెస్ ఆస్తి: మహేశ్‌కుమార్‌గౌడ్
ఆదివాసీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌ డ్ పేర్కొన్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదన్నారు. ఆదివాసీ, గిరిజనులకు భూమిపై హక్కు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించా రని గుర్తు చేశారు. భవిష్యత్‌లో రాష్ట్రంలోని 1700 గ్రామాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్ల డించారు.
మతం పేరిట ఓట్లు అడిగే పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని పరో క్షంగా బీజేపీని ఆయన విమర్శించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ స మానంగా దక్కాలని, అదే కాంగ్రెస్ సామాజిక నినాదమన్నారు. జానారెడ్డి మాట్లాడు తూ.. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఆదివాసీ గిరిజనుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ట్రైకార్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు వారంపాటు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నేనావత్ బాలూనా యక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.