calender_icon.png 3 April, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి

02-04-2025 05:03:46 PM

సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు..

కామారెడ్డి (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను బీసీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ (స్థానిక సంస్థల) హాజరు అయ్యారు. కలెక్టర్ ఆశిష్ సంగువన్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.

అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగువన్ మాట్లాడుతూ... సర్వాయి పాపన్న వరంగల్ జిల్లాలో జన్మించడం జరిగిందని, భువనగిరి స్థానంగా ఎన్నో పోరాటాలు చేసి సమ సమాజ స్థాపన కోసం, బడుగు, బలహీన అభ్యున్నతికి పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. గౌడ సంఘ ప్రతినిధులు, ఇతర సంఘాల నాయకులు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చక్రధర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్, పవన్, స్వప్న, సునీత, రాజేశ్వర్ ఆఫీస్ సిబ్బంది, గౌడ సంఘ నాయకులు ధర్మగోని రాజాగౌడ్, తిరుమల గౌడ్, కల్లు గీత కార్మికులు, సంఘ నాయకులు మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.